ఇక  శ్రీనిధి శెట్టి నుదిటిపై ఓ గాటు వుంటుంది. అది తనకు చిన్నతనంలో వుండిందనీ, నాన్న, సోదరితో ఆటలాడుతుండగా అక్కడ దెబ్బ తగిలిందని చెబుతూ..ఇదంతా నిజంకాదు.. అసలు నిజం ఏమంటే, నాకు యాక్షన్ అంటే ఇష్టం. అలా కర్రలు, కత్తితో ఓసారి శిక్షణ తీసుకుంటుండగా ఎడమ కంటి పైన నుదిటమీద తాకింది. దాంతో పెద్ద గాయమైంది. అది కొన్నాళ్ళకు ఇలా గుర్తులా మిగిలిందని.. ఆ గాటును చూపించింది. అందుకే ఎప్పుడు ఏమిజరుగుతుందో మనకు తెలీదు. నేను ఇలా కె.జి.ఎఫ్. సీక్వెల్ లో చేస్తానని కానీ, నానితో హిట్ సినిమా చేస్తానని అనుకోలేదని చెబుతుంది.