విటమిన్ మాత్రలు, సప్లిమెంట్లతో కరోనావైరస్ నివారణ సాధ్యమా?

బుధవారం, 26 ఆగస్టు 2020 (21:15 IST)
కోవిడ్ 19తో సహా కరోనా వైరస్‌ను నివారించడానికి సహాయపడే విటమిన్లు లేదా మందులు ఇప్పటివరకూ అందుబాటులో లేవు. కొన్ని పోషకాలు మీ రోగనిరోధక శక్తికి బలంగా సహాయపడతాయి. వైరస్‌తో పోరాడగల సామర్థ్యానికి సహాయపడతాయి.
 
వీటిలో శరీరంలో లోపం ఉంటే విటమిన్ డి, అధిక మోతాదు విటమిన్ సి, జింక్, పొటాషియం ఉన్నాయి. ఇవి వున్న ఆహార పదార్థాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌తో శరీరం పోరాడుతుంది. కూరగాయలు, పండ్లు మరియు లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ కూడా సహాయపడవచ్చు.
 
గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవచ్చు. బాగా లోతైన శ్వాస వ్యాయామాలు లేదా ధ్యానం వంటి రెగ్యులర్ వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ పద్ధతులు కూడా రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు