చైనా రెండేళ్లుగా కరోనా వైరస్ వ్యాప్తిని చూస్తోంది. ఆదివారం నాడు ఆ దేశంలో ఒకే రోజులో 3,100 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది రెండేళ్లలో అత్యధికం. ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల పెరుగుదల చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం చైనాలోని వివిధ ప్రాంతాలలో మిలియన్ల మందిని లాక్‌డౌన్‌లో పెట్టేసింది.
మన దేశంలో 2,503 కొత్త కేసులు, లాక్‌డౌన్ వుందా?
ఇక మన దేశం విషయానికి వస్తే గత 24 గంటల్లో 2,503 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 మే నుండి చూస్తే ఇది అత్యల్పమైన సంఖ్య. యాక్టివ్ కేసులు 36,168కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
తాజా కేసులతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,29,93,494కి పెరిగింది.
27 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,15,877కి చేరుకుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు తాజా డేటాను వెల్లడించింది. మరి చైనా 3 వేల కేసులకే 2 కోట్ల మందికి లాక్ డౌన్ విధిస్తే మన దేశంలో ఎన్ని కోట్లమందికి విధించాలో?