తెలంగాణాలో పోలీస్ శాఖలో 18,334 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సోమవారం, 14 మార్చి 2022 (11:06 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 80 వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులోభాగంగా, తొలుత 18,344 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదలకానుంది. 
 
పోలీస్ శాఖ నుంచి ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్ (ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో పోస్టుల భర్తీ ఉండనున్నట్టు తెలుస్తుంది. 
 
మొత్తం 18,344 ఖాళీలలో 1500 పైగా పోస్టులు సబ్ ఇన్‌స్పెకర్ ఆఫ్ పోలీస్ పోస్టులను పోలీస్ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. కొత్త జిల్లాలు, కొత్త పోలీస్ రేంజ్‌లను దృష్టిలో ఉంచుకుని ఎస్.ఐ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్ పోస్టులని పోలీస్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు