భారత్‌లో పెరిగిపోతున్న కేసులు... ప్రైవేటు వైద్య కాలేజీలో కరోనా పరీక్షలు

ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (18:13 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులో నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అయినప్పటికీ, ఈ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా మొత్తం 8731 కేసులు నమోదయ్యాయి. అలాగే, 295 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 845 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష 87 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. 151 పరీక్ష కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని, కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అత్యధికంగా మహారాష్ట్ర్లో 1895, ఢిల్లీలో 1069, తమిళనాడుల 969, తెలంగాణాలో 407, ఆంధ్రప్రదేశ్‌లో 406, రాజస్థాన్‌లో 796, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 532, గుజరాత్‌లో 493, ఉత్తరప్రదేశ్‌లో 452, కేరళలో 373, జమ్మూకాశ్మీర్‌లో 224, కర్నాటకలో 226, హర్యానాలో 179, పంజాబ్‌లో 158, వెస్ట్ బెంగాల్‌లో 132, బీహార్‌లో 64, ఒరిస్సాలో 54 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు