కరోనా రోగుల్లో వైరస్ రీ యాక్టివేట్?

ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (11:38 IST)
కరోనా వైరస్ బారినపడి విముక్తి పొందిన వారిలో మళ్లీ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా సౌత్ కొరియాలో 91 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అయితే, నిపుణులు మాత్రం ఒకసారి సోకిన తర్వాత మళ్లీ సోకడం అసాధ్యమని అంటున్నారు. 
 
నిజానికి కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న రోగులకు మళ్లీ వైరస్‌ సోకుతుందా? అంటే ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కానీ, తాజాగా దక్షిణ కొరియాలో వైరస్‌ బారినపడి కోలుకున్న 91 మందికి పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్‌గా తేలింది. 
 
వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిన వారిలో 91 మందికి పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్‌ వచ్చిందని దక్షిణ కొరియా 'వ్యాధుల నియంత్రణ, నిరోధక కేంద్రాలు (కేసీడీసీ)' డైరెక్టర్‌ జియాన్‌ కయాంగ్‌ వెల్లడించారు. 
 
దీంతో ఈ రోగులందరినీ ఆస్పత్రుల్లో చేర్చి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోగుల్లో వైరస్‌ మళ్లీ క్రియాశీలమైందా (రీయాక్టివేట్‌) లేక మళ్లీ సోకిందా (రీఇన్‌ఫెక్షన్‌) అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు