కరోనా వైరస్‌ విలయతాండవం.. 24 గంటల్లో 879 మంది మృతి

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (10:15 IST)
దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్‌ రెండో దశలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం కంటే స్వల్పంగా తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 879 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. మరణాల రేటు 1.26 శాతానికి చేరింది. 
 
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి చేరింది. కొత్తగా 97,168మంది వైరస్‌ బారి నుండి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,697కు చేరి.. రికవరీ రేటు 89.86శాతానికి తగ్గింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,64,698కి చేరింది.
 
కరోనా మహమ్మారి ప్రభావం ఛత్తీస్‌గఢ్‌లో మరింత దారుణంగా ఉంది. రాయ్ పూర్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సహా, పలు పట్టణాల్లోని ఆసుపత్రులలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. పలు మృతదేహాలను దాచే పరిస్థితులు లేక ఎండలో వాటిని ఉంచడాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు