దేశంలో కరోనా కేసుల అప్డేట్స్ ఇవే... తెలంగాణాలో శాంతించిన వైరస్

ఆదివారం, 11 అక్టోబరు 2020 (10:15 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడినవారి సంఖ్య 70 లక్షలకు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 74,383 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,53,807 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 918 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,08,334 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 60,77,977 మంది కోలుకున్నారు. 8,67,496 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 8,68,77,242 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,78,544 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇకపోతే, తెలంగాణ‌ా రాష్ట్రంలో కరోనా వైరస్ శాంతించింది. ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,717 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,103 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,12,063 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,85,128 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,222 కు చేరింది. ప్రస్తుతం 25,713 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 276, రంగారెడ్డి జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. వారిలో 21,209 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.  తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 35,47,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు