తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరా, జన్మదిన శుభాకాంక్షలు..!
శనివారం, 10 అక్టోబరు 2020 (10:58 IST)
స్టూడెంట్ నెం 1 చిత్రంతో దర్శకుడిగా పరిచయమై... తొలి చిత్రంతోనే విజయం సాధించి ఇప్పటివరకు అపజయం ఎరుగని డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పి గ్రేట్ డైరెక్టర్ అయినప్పటికీ... అతనిలో ఏమాత్రం అహంకారం కనిపించదు.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే రాజమౌళి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా రాజమౌళి గురించి క్లుప్లంగా మీకోసం... ఎన్టీఆర్ స్టూడెంట్ నెం1 సినిమతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి తొలి సినిమాతోనే సక్సస్ సాధించారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో రాజమౌళితో పాటు ఎన్టీఆర్ కెరీర్ కూడా మారిపోయింది. ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన మరో సినిమా సింహాద్రి. ఈ సినిమా సంచలన విజయం సాధించి.. కనివినీ ఎరుగని రికార్డ్స్ సృష్టించింది.
ముఖ్యంగా సింహాద్రి సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రాజమౌళి వీరిద్దరి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మాస్ మసాలాకి సెంటిమెంట్ జోడించి సినిమా తీసి తనకు తానే తిరుగులేని డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ తరువాత యువ హీరో నితిన్‌తో సై సినిమా తీసాడు. సక్సెస్ సాధించాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఛత్రపతి. మాస్ సినిమాకి మదర్ సెంటిమెంట్ జోడించి ఛత్రపతి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సంచనల విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రవితేజతో తీసిన చిత్రం విక్రమార్కుడు. ఈ సినిమాలో రవితేజను రెండు విభిన్న పాత్రల్లో చక్కగా చూపించాడు.
ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్నీ ఉన్న విక్రమార్కుడు రాజమౌళికి మరో విజయాన్ని అందించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం మగధీర. పునర్జన్మ నేపథ్యంగా రూపొందిన మగధీర తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది.
ఆ తర్వాత నానితో ఈగ సినిమా తీసాడు. ఈ సినిమాతో రాజమౌళి జాతీయ స్ధాయిలో గుర్తింపు ఏర్పరుచుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి అందించిన మరో వండర్ బాహుబలి, బాహుబలి 2. ఈ సినిమాలు తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి.
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలా... అపజయం అంటే ఏంటో తెలియకుండా సంచలన చిత్రాలు అందిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలి.. ఎన్నో సంచలన చిత్రాలు అందించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు దర్శకధీరా..!