కరోనా మహమ్మారి నియంత్రణకు తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సంబంధిత నియమాలను, లాక్డౌన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్‌ను విధించింది.
అవసరమైన కార్యకలాపాలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఇన్ఫ్లుయెంజా లాంటి అనారోగ్యం (ఐఎల్ఐ), ఇంకా తీవ్రమైన శ్వాసకోశ అంటువ్యాధులు (ఎస్ఎఆర్ఐ) స్థానిక జిల్లా, పోలీసులు, మున్సిపల్ అధికారులు నిర్దేశించిన నియంత్రణ చర్యలను ఖచ్చితంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉంటుంది.