భారత్‌లో కరోనా అప్‌డేట్స్ : 24 గంటల్లో 40 మరణాలు - 1035 కేసులు

శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:40 IST)
మన దేశంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు, పకడ్బంధీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ... కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో గత 24 గంటల్లో 1035 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి 40 మంది చనిపోయారు. 
 
అలాగే, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, గుజరాత్‌లో 19 మంది మరణించారు. 
 
అదేవిధంగా, తమిళనాడులో 911, ఢిల్లీలో 903, రాజస్థాన్‌లో 561, తెలంగాణలో 487, మధ్యప్రదేశ్‌లో 451, ఉత్తరప్రదేశ్‌లో 433, ఏపీలో 381, గుజరాత్‌లో 378, కేరళలో 364, జమ్మూకశ్మీర్‌లో 207, కర్ణాటకలో 207, హర్యానాలో 176, పంజాబ్‌లో 151, బెంగాల్‌లో 116, బీహార్‌లో 60, ఒడిశాలో 50, ఉత్తరాఖండ్‌లో 35, అసోంలో 29, హిమాచల్‌ప్రదేశ్‌లో 28, చండీఘర్‌లో 19, ఛత్తీస్‌గఢ్‌లో 18, లడఖ్‌లో 15, జార్ఖండ్‌లో 14, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 11, గోవాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్‌లో 2, త్రిపురలో 2, అరుణాచల్‌ప్రదేశ్‌, దాద్రా నగర్‌ హవేలి, మిజోరాంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.

 

40 deaths and 1035 new cases in last 24 hours, the sharpest ever increase in cases; India's total number of #Coronavirus positive cases rises to 7447 (including 6565 active cases, 643 cured/discharged/migrated and 239 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/14T518RPgR

— ANI (@ANI) April 11, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు