సీఎం కేసీఆర్ అల్లుడికి కరోనా పాజిటివ్.. ధ్రువీకరించిన ఎమ్మెల్సీ కవిత

బుధవారం, 24 మార్చి 2021 (20:56 IST)
కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. పేదధనిక తేడా లేకుండా.. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ వదలట్లేదు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ అల్లుడు, టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

ఈ విషయాన్ని కవితనే స్వయంగా ధ్రువీకరించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తమ కుటుంబమంతా క్వారంటైన్‌లో ఉందని, ఇతరులెవరూ తమరిని కలిసేందుకు రావద్దని కవిత తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
 
అంతేగాకుండా''నా భర్త అనిల్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో బాగానే ఉన్నారు. మా కుటుంబంతా క్వారంటైన్‌లోనే ఉంది. ఇప్పట్లో మమ్మల్నెవరూ కలిసేందుకు వీలు లేదు ఆఫీసు కూడా మూసివేశాం. క్వారంటైన్ నిబంధనలు ముగిసి పరిస్థితులు చక్కబడ్డాక ఆఫీసు తెరుచుకుంటుంది'' అని కవిత్ ట్వీట్ చేశారు.
 
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. తెలంగాణలోని స్కూల్స్ , కాలేజీలు కరోనా హాట్ స్పాట్లుగా మారగా.. ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

ఒక్క కాలేజీలోనూ 175 మంది విద్యార్థులకు కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా ప్రభావంతో అటు తెలంగాణలో కాలేజీలు, స్కూళ్లు మళ్లీ మూతపడ్డాయి.

హాస్టల్ విద్యార్థులందరూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. నెల రోజులుగా బిజీ బిజీగా గడిపిన విద్యార్థులు మరోసారి ఆన్‌లైన్ క్లాసులతో ఇళ్లకే పరిమితం కాబోతున్నారు. దీనిపై విద్యార్థుల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు