సంజీవని వాహనాలుగా ఆర్టీసీ బస్సులు.. అరగంటలోనే ఫలితాలు..

శుక్రవారం, 17 జులై 2020 (10:17 IST)
Sanjeevani vehicles
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు జగన్ సర్కారు టెస్టుల సంఖ్యను పెంచింది. ల్యాబ్‌లకు తోడు కొత్తగా సంజీవని వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో అరగంటలోనే కరోనా టెస్టుల ఫలితం రానుంది. ఆర్టీసీ బస్సులను సంజీవని వాహనాలుగా మార్చి ఏపీలోని అన్ని జిల్లాలకు చేరవేశారు. విశాఖపట్నం జిల్లాలో ఐదు సంజీవని వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. 
 
బస్సుకు రెండు వైపుల నుంచి ఒకేసారి పదిమంది నమూనాలు సేకరించవచ్చు ఫలితాన్ని కేవలం అరగంటలోనే తెలుసుకోవచ్చు స్క్రీనింగ్‌ పరికరాలు, స్వాబ్‌ను అనుసంధానించే పరికరం, వివరాల నమోదుకు వినియోగించే కంప్యూటర్‌, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు.
 
ఈ క్రమంలో నగర, పట్టణ, గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో అనుమానితుల నుంచి నమూనాలను సేకరించేందుకు ఐదు బస్సులు సిద్ధం చేశారు. కరోనా పరీక్షలు చేసేలా బస్సులో సీట్లు తొలగించి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు