కరోనా టీకా తొలి డోసు వేయించుకున్న వైద్య విద్యార్థి మృతి!

గురువారం, 4 మార్చి 2021 (14:39 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన టీకాల పంపిణీ దేశంలో జోరుగా సాగుతోంది. అయితే, ఈ టీకాలు వేయించుకున్న వారిలో కొందరు చనిపోతున్నారు. తాజాగా తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 
బీహార్‌ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ్రామానికి చెందిన 23 యేళ్ల శుభేందు పాట్నాలోని నలంద మెడికల్‌ కాలేజ్, ఆసుపత్రిలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఎంబీబీఎస్‌ చివరి ఏడాది విద్యార్థి అయిన ఆయనకు గత నెల చివరి వారంలో కోవాగ్జిన్‌ టీకా తొలి డోసు వేశారు. అతడు రెండో డోసు తీసుకోవాల్సి ఉన్నది. 
 
కాగా, ఫిబ్రవరి 24న దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆ వైద్య విద్యార్థికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సొంతూరులోని తన ఇంటికి వెళ్లిన శుభేందు ఈ నెల ఒకటో తేదీన చనిపోయాడు. మరోవైపు అతడు ఉన్న కాలేజ్‌ హాస్టల్‌లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు