తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాననీ, అలాగే, ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో టీకా వేయించుకున్నారు. ఆయనకు ఎయిమ్స్‌లో పని చేసే పి.నివేదా అనే నర్సు ఈ టీకాను వేసింది.
ఆ తర్వాత ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ఎయిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నానని చెప్పారు. కరోనాపై పోరాడుతోన్న వైద్యులు, శాస్త్రవేత్తలను ఆయన కొనియాడారు.
కాగా, మోడీ సోమవారం భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను వేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన అసోంలో తయారు చేసిన కండువాను ధరించి కనపడ్డారు. అసోం, పుదుచ్చేరికి చెందిన రోసమ్మ అనిల్, పి.నివేద అనే నర్సులు మోడీదీకి వ్యాక్సిన్ వేసే విధి నిర్వర్తించారు. మోడీకి ఎడమ చేతికి రోసమ్మ వ్యాక్సిన్ వేశారు.