కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. తాజాగా జర్మనీలో కరోనా రక్కసి విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జర్మనీలో కరోనా కేసులు మిలియన్ మార్క్‌ను దాటాయి. ఈ దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 22,806 కొత్త కేసులు నమోదైనట్లు రాబర్ట్ కొచ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కొవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 10,06,394కు చేరింది.
ఇక దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ప్రధానంగా జనాభా అధికంగా ఉండే నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోనే నాల్గో వంతు పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత బవేరియాలో 1,98,000 కేసులు... బెర్లిన్‌లో 62,000 కేసులు నమోదయ్యాయి.