భారత్‌లో కోవిడ్ రెండో దశ ఉద్ధృతి జులై వరకూ కొనసాగే అవకాశముందని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ అంచనా వేశారు. ప్రస్తుతం కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో పరిస్థితులు కుదుటపడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.