సోనూసూద్‌ను సాయం కోరిన శిఖర్ ధావన్

బుధవారం, 12 మే 2021 (13:53 IST)
సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోనూసూద్ సాయాన్ని కోరుతున్నారు. గతేడాది కాలంగా సోనూసూద్ చేయని సాయం లేదు. వలస కూలీల దగ్గరి నుంచి ఆక్సిజన్ ప్లాంట్ల దాకా అన్ని రకాలుగా దేశానికి సేవ చేస్తున్నాడు. మొన్నటి వరకు సామాన్యులే ఆయన సాయం కోరేవారు. కానీ ఇప్పుడు బిగ్ సెలబ్రిటీలు కూడా సోనూసూద్‌ను వేడుకుంటున్నారు.
 
మొన్నటికి మొన్న క్రికెటర్ సురేష్‌రైనా తన ఆంటీకి సాయం కావాలని సోనూసూద్‌ను ట్విట్టర్ వేదికగా కోరగా.. వెంటనే స్పందించి ఆక్సిజన్ అందించాడు. ఇప్పుడ మరో క్రికెటర్ కూడా సోనూసూద్ సాయాన్ని కోరాడు. టీమిండియా క్రికెటర్ గబ్బర్ శిఖర్ దావన్ ట్విట్టర్‌లో సాయం అభ్యర్థించాడు.
 
తన ఫ్రెండ్ జై కుష్ వాళ్ల అమ్మకు 40శాతం కన్నా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని, వెంటనే యాక్టెమ్రా 800ఎంజీ కావాలంటూ ట్వీట్‌చేశాడు. 
 
ఆమె ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో ఉందని, ఆమెకు సాయం చేయాలని హర్యానా సీఎం మనోహర్‌లాల్ కట్టర్‌, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్‌లకు, అలాగే సోనూసూద్‌లకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు శిఖర్ దావన్‌. మరి ఈ ముగ్గరిలో ఎవరు ముందుగా స్పందిస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు