దేశంలో కొత్తగా మరో 2,124 కరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 130 అధికంగా ఉన్నాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,31,42,192కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 14,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 17 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,26,02,714కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితలు రికవరీ కేసుల సంఖ్య 98.75 శాతంగా ఉంది.
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 1,977 మంది కోలుకున్నారు. రోజువారీ పాటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.49 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.