కరోనా కొత్త వేరియంట్-మహిళలో మొదటి ఫ్లూరోనా

శనివారం, 1 జనవరి 2022 (14:34 IST)
కరోనా వేరియంట్ రోజుకో రూపును మార్చుకుంటుంది. తాజాగా కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లతో జనాన్ని కలవరపెడుతోంది. తాజాగా కరోనా మరో కొత్త వేరియంట్ అవతారం ఎత్తింది. 
 
డెల్టా, ఒమిక్రాన్ ల కలయికతో ఫ్లోరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఫ్లోరోనా అంటే కోవిడ్ 19, ఇన్‌ఫ్లూయెంజా డబుల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. ఈ కేసు పెటా టిక్వా నగరంలో నమోదైంది. 
 
పెటా టిక్వా నగరంలోని బీలిన్సన్ ఆస్పత్రిలో ఇటీవలే ప్రసవించిన మహిళలో మొదటి ఫ్లూరోనా వైరస్ కనుగొనబడిందని అరబ్ న్యూస్ వార్తా సంస్ధ తన ట్విట్టర్ లో వెల్లడించింది. ఆ మహిళ వ్యాక్సిన్ తీసుకోలేదని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు