ఫైజర్ టీకాతో గుండెమంట... మరీ అంతలేదంటున్న కంపెనీ

బుధవారం, 2 జూన్ 2021 (12:46 IST)
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పలు రకాలైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో ఫైజర్ టీకా ఒకటి. ఈ టీకా వేయించుకున్న అనేక మందికి గుండెమంట (మయోకార్డిటిస్) వచ్చింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
50 లక్షల మంది టీకాలు వేసుకుంటే వారిలో 275 కేసుల్లో ఇలాంటి సమస్య కనిపించిందని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. 95 శాతం మందిలో తేలికపాటి లక్షణాల మాత్రమే కనిపించాయని, ఎవరూ 4 రోజులకు మించి ఆస్పత్రిలో ఉండాల్సి రాలేదని సర్వే నివేదిక తెలిపింది. 
 
ముఖ్యంగా, రెండో డోసు ఫైజర్ టీకా తీసుకున్న 16-30 సంవత్సరాల వయసువారిలో, అదీ మగవారిలో ఎక్కువగా ఈ గుండెమంట సమస్య బయటపడిందని తెలిపింది. 
 
దీనిపై ఫైజర్ కంపెనీ దీనిపై స్పందించింది. ఈ సమస్య మరీ అంతగా లేదని తెలిపింది. అయితే టీకాకు, గుండెమంట సమస్యకు లంకె ఉన్నట్టు ఇప్పటివరకైతే ఖచ్చితంగా రుజువు కాలేదని ఫైజర్ కంపెనీ అంటున్నది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు