ఏపీలో కరోనా విలయతాండవం : కొత్తగా 6341 పాజిటివ్ కేసులు

శుక్రవారం, 18 జూన్ 2021 (19:05 IST)
సౌత్ ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది. కానీ, ఏపీ మాత్రం ఈ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇందులో 6,341 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. 
 
అలాగే, కరోనాతో గత 24 గంటల్లో 57 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 18,39,243కు  కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 67,629 యాక్టివ్ కేసులున్నాయి.
 
మరోవైపు ఏపీలో కర్ఫ్యూ వేళలను సడలించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కొవిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. 
 
సోమవారం నుంచి ఇకపై ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జూన్‌ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలవుతుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు