తబ్లీగి జమాత్ మత సమ్మేళనానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11 కరోనా కేసులు మాత్రమే వుండే. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం 303 కేసులు ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఈ కేసులు విపరీతంగా నమోదయ్యాయి.
అదేసమయంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను డేంజర్ ఏరియాలుగా ప్రకటించి, లాక్‌డౌన్ నిబంధనలను పక్కాగా అమలు చేశారు. ఫలితంగా గడిచిన 12 గంటల సమయంలో ఏపీలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఇది కొంతవరకు ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. గుంటూరు నగరంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో మొత్తం ఏపీలో 304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మంగళవాం నమోదైన పాజిటివ్ కేసుతో కలిపి గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య 33కు చేరింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు జరిపిన పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే రావడం కొంత ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.