కరోనా కేసుల్లో చైనాను అధికమించిన మూడు రాష్ట్రాలు!!

మంగళవారం, 30 జూన్ 2020 (15:52 IST)
కరోనా వైరస్ కేసుల్లో మూడు రాష్ట్రాలు ఈ వైరస్‌కు పురుడు పోసుకున్న చైనాను అధికమించాయి. చైనాలో కేవలం 83 వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కానీ, మహాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో మాత్రం ఈ కేసుల సంఖ్య అధిమించాయి. 
 
మహారాష్ట్రలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 1,69,883 సంఖ్యతో ఆ రాష్ట్రం తొలిస్థానంలో కొనసాగుతున్నది. కరోనా వల్ల మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7,610 మంది మరణించారు. 
 
అలాగే, తమిళనాడు మరోసారి రెండో స్థానానికి చేరింది. ఆ రాష్ట్రంలో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 86,224కు చేరగా 1,141 మంది చనిపోయారు. 
 
ఇక సోమవారం వరకు రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో గత 24 గంటల్లో 2,084 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,161కు పెరిగి  ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నది. ఢిల్లీలో వైరస్‌ బారినపడి 2,680 మంది మరణించారు. 
 
చైనాలో ఇప్పటివరకు మొత్తం 83,531 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యను మహారాష్ట్రతోపాటు తమిళనాడు ఇప్పటికే అదిగమించగా తాజాగా ఢిల్లీ కూడా దాటింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో మూడొంతులు ఈ మూడు రాష్ట్రాల నుంచే నమోదు కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు