స్పుత్నిక్ వీ ప్రయోగాత్మక కార్యక్రమం ద్వారా మణిపాల్ హాస్పిటల్స్ టీకా పోర్ట్‌ఫోలియో
మంగళవారం, 8 జూన్ 2021 (16:44 IST)
భారతదేశంలో రెండవ అతి పెద్ద బహుళ పత్యేకతలు కలిగిన ఆస్పతి గొలుసుకట్టు సంస్థగా వెలుగొందుతున్న మణిపాల్ హాస్పిటల్స్, దేశంలో టీకా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముందుండటంతో పాటుగా వీలైనంత ఎక్కువమంది ప్రజలకు చేరుకోవడానికి లక్ష్యంగా చేసుకుంది.
ఈ ఆస్పత్రి డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ (డాక్టర్ రెడ్డీస్)తో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తో కూడిన తమ ప్రస్తుత టీకా పోర్ట్‌ఫోలియోకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగాత్మక కార్యక్రమం సైతం జోడించింది. గత నెల హైదరాబాద్‌లో డాక్టర్ రెడ్డీస్ ప్రారంభించిన పరిమిత ప్రయోగాత్మక ప్రారంభ కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని మణిపాల్ హాస్సిటల్స్‌లో ఈ కార్యక్రమం ఆరంభించారు.
ఈ నూతన అభివృద్ధి గురించి మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఓఓ శ్రీ కార్తీక్ రాజగోపాల్ మాట్లాడుతూ స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాత్మక కార్యక్రమానికి మణిపాల్ ఆస్పత్రులు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని వెల్లడించడానికి సంతోషిస్తున్నాము. డాక్టర్ రెడ్డీస్‌తో మణిపాల్ ఆస్పత్రులు అతి సన్నిహితంగా కలిసి పనిచేయడంతో పాటుగా స్పుత్నిక్ వీ టీకాలను నిర్వహించేందుకు అత్యాధునిక మౌలిక వసతులను సృష్టించింది.
ఈ ఆస్పత్రుల గొలుసుకట్టు సంస్థ ఇప్పటికే కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్ టీకా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నిర్వహించడంతో పాటుగా ఇప్పుడు స్పుత్నిక్‌వీ ను అదనంగా జోడించడం ద్వారా తమ టీకా కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నెల ద్వితీయార్థంలో టీకా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మేము ఆశిస్తున్నాము అని అన్నారు.
ప్రస్తుత అవసరాలను తీర్చడమే లక్ష్యంగా స్పుత్నిక్ వీ టీకాల మొదటి బ్యాచ్‌ను నేరుగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. మణిపాల్ హాస్పిటల్స్ ఈ వ్యాక్సిన్‌ల నిల్వ కోసం విస్తృత శ్రేణిలో కోల్డ్ చైన్ స్టోరేజీ మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టింది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌లను మైనస్ 18 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నిల్వ చేయాల్సి ఉంది. మణిపాల్ హాస్పిటల్స్ మరియు డాక్టర్ రెడ్డీస్‌లు అత్యంత ఖచ్చితమైన రీతిలో కోల్డ్ చైన్‌ను వ్యాక్సిన్ మార్గదర్శకాలకనుగుణంగా నిర్వహిస్తున్నాయి. ఈ కోల్డ్ చైన్ స్టోరేజీలో ప్రతి సెకనుకూ ఉష్ణోగ్రతను నమోదు చేసే రియల్ టైమ్ లాగర్ సైతం ఉంది.
డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్ మార్కెట్స్ (ఇండియా అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్) సీఈఓ ఎం.వి.రమణ మాట్లాడుతూ భారతదేశంలో స్పుత్నిక్ వీ టీకా ప్రయోగాత్మక కార్యక్రమానికి సిద్ధమవుతున్న వేళ బెంగళూరులో మణిపాల్ ఆస్పత్రులతో మేము భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. జూన్‌లోనే వాణిజ్యపరంగా ఈ టీకాను ఆవిష్కరించడానికి ముందు మరిన్ని నగరాలకు విస్తరించనున్నాం. రాబోయే నెలల్లో వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు టీకాలను వేయగలమని ఆశిస్తున్నాము అని అన్నారు.