దీంతో నెల్లూరు జిల్లాలో ప్లాస్మా థెరఫీని ప్రారంభించిన వైద్యులు మంచి ఫలితాల్ని చవిచూసారు. కరోనా నుండి కోలుకున్న దాదాపు 130 మంది ప్లాస్మా దానం చెయ్యడంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న 75 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యడం వలన ప్రాణాంతక స్థితిలో ఉన్నవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, తద్వారా కరోనా రోగుల శరీరంలో వైరస్‌తో పోరాడి వాటిని అంతం చేస్తున్నాయని వైద్య నిపుణులు తెలియజేశారు.
ప్లాస్మా దానం వలన 55 శాతం అవి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను సంతరింప చేసి అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని వీటి వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా బాధితులకు ప్లాస్మా థెరఫీ అందించడం వల్ల మంచి ఫలితం లభించిందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ ప్లాస్మా థెరఫీకి కావలసిన పరికరాలను సమకూర్చడానికి కావలసిన సహాయం అందించారు.