బొప్పాయి ఆకుల రసం తాగితే కరోనావైరస్ తగ్గుతుందా?

శనివారం, 29 ఆగస్టు 2020 (21:59 IST)
బొప్పాయి ఆకులు, కాయలు, గింజల్లో ఔషధ విలువలు వున్న విషయం నిజమే. బొప్పాయి ఆకును తరచుగా రసంగా తీసుకుంటారు. ఇది డెంగ్యూ జ్వరం, కడుపులో మంటను తగ్గించడం, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుందని చెపుతారు. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
 
ఐతే కరోనావైరస్ ప్రయోజనాల కోసం ఇది ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలు అందుబాటులో లేవు. కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి లేదా నయం చేయడానికి సహాయపడే ఆధారాలు కూడా లేవు. సాంప్రదాయిక మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడంలో ఎటువంటి హాని లేదు.
 
అయితే కోవిడ్ సంక్రమణ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు చేతి పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడమే. వాటితో పాటు బయటకు వెళుతున్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు