కానీ, వాంతులు విరేచనాలూ ఈ సమయంలో ఎక్కువగా కావడం వల్ల సదరు పేషెంట్లు డీహైడ్రేట్‌కు లోనయ్యే ముప్పు ఉన్నది. తద్వార ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కలుషిత ఆహారం, నీటిని తీసుకోవడం, నోరో వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు ఈ వైరస్
సోకుతుంది. జంతువుల నుంచీ నోరో వైరస్ సోకవచ్చు.
లక్షణాలివే..
నోరో వైరస్ సోకిన వారిలో వాంతులు, విరేచనలు కలుగుతాయి. పొట్ట నొప్పి, కడుపులో తిప్పినట్టు కావడం వంటివి లక్షణాలుగా కనిపిస్తాయి. తలనొప్పి, కాళ్లు, చేతుల నొప్పి.. అప్పుడప్పుడు ఒళ్లు నొప్పులూ వస్తాయి. కొందరిలో శరీర ఉష్ణోగ్రతలూ పెరుగుతాయి.
నివారణ మార్గాలు..
పరిశుభ్రంగా ఉండి నోరో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఆహారం తీసుకోవడానికి ముందు చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు.
నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది. కాబట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ముట్టుకున్న వస్తువుల ఉపరితలాలపైనా వైరస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి, అలాంటి చోట్లా జాగ్రత్తగా వ్యవహరంచాలి.