ఒమిక్రాన్‌ చావుదెబ్బ.. 57 దేశాలకు పాకింది..

బుధవారం, 8 డిశెంబరు 2021 (10:00 IST)
Omicron
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఇప్పుడు 57 దేశాలకు పాకింది. 
 
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల మరోసారి లాక్‌డౌన్‌ను కూడా విధించారు. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. 
 
ఇప్పటికే డెన్మార్క్‌లో 398 కేసులు నమోదు కాగా, యూకేలో 437, యూఎస్‌లో 50, జింబాబ్వేలో 50 ఒమిక్రాన్ కేసులు నమోదైనాయి. భారత్‌లో 23 కేసులు నమోదైనాయి. ఇప్పటికే పలు దేశాలు ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు