కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 13 వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా టీకీలు వేసినట్టు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇదే అంశంపై ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, టీకా డ్రైవ్‌లో భాగంగా దశలవారీగా 13వేల మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ను వేసినట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై లోక్‌సభలో రాజస్థాన్‌లోని పాలి ఎంపీ పీపీ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. రైల్వే ఉద్యోగులకు టీకాలు వేసే కార్యక్రమం దశలవారీగా జరుగుతుందన్నారు. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు 13,117 మంది రైల్వే ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేశామన్నారు. 3,70,316 మంది ఫ్రంట్‌లైన్, రైల్వే ఉద్యోగులను మరో విడత కోసం గుర్తించినట్లు పేర్కొన్నారు