పిల్లలకు కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శనివారం, 5 జూన్ 2021 (09:39 IST)
పిల్లలకు కోవిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. 
 
పాలిచ్చే తల్లులయితే నిపిల్ ఏరియాను శుభ్రంగా సోపుతో శుభ్రపరచి పాలివ్వాలి. 
 
చిన్న పిల్లలను దగ్గరకు తీసుకోటానికి లేదా ముద్దు పెట్టుకోవడానికి ఇతరులను అనుమతించవద్దు.
 
తల్లిదండ్రులు తమ పిల్లలను మాత్రమే దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఇతరుల పిల్లలను ప్రస్తుత పరిస్థితులలో యేమాత్రం దగ్గరకు తీసుకోవద్దు.
 
పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లవద్దు.
 
తల్లి పాలిచ్చే పిల్లల తల్లిదండ్రులు బయటకెళితే జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు పాటించాలి.
 
పిల్లలతో కుటుంబ సందర్శనలు మరియు విందులకు తీసుకెళ్లొద్దు.
 
ఇతర బంధువుల ఇళ్ళకు కూడా పంపకూడదు. మీ పిల్లల్ని సురక్షితంగా ఉంచండి.
 
మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే, సమీప ఆరోగ్య కేంద్రానికి నివేదించండి. తదుపరి చికిత్స సూచించినట్లయితే మాత్రమే మరొక ఆసుపత్రికి వెళ్లండి.
 
పుట్టెంటుకలు, నామకరణ వంటి పిల్లల సంబంధిత ఆచారాలన్నీ వాయిదా వేయండి. 
 
పిల్లల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని చేర్చండి.
 
పొరుగు ఇళ్లలో కూడా పిల్లలను ఆడనివ్వవద్దు.
 
పిల్లలు తరచుగా హ్యాండ్ వాష్ చేసుకునేలా అలవాటు చేయండి.
 
కొని తినే పదార్థాలన్నీ శుభ్రపరచాలి, చేతితో కడిగిన తర్వాత మాత్రమే పిల్లలకు ఇవ్వాలి.
 
పిల్లలతో బయట ఊళ్లకు ప్రయాణాలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులుంటే ఆరోగ్య అధికారులకు తెలియజేయండి. అక్కడ ఎలా ఉందో కనుక్కోండి. 
 
ఇంట్లో శానిటైజర్ జాగ్రత్త తీసుకోవాలి. శిశువు చేతులు శుభ్రపరచాలి. 
 
పెద్దలకు కొరోనా ఉంటే స్ట్రిక్టు ఐసోలేషన్ ఉండాలి. ఇంట్లో కూడా మాస్కులు వేసుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు