ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా అంతం చేయడానికి ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్-వీ నమోదైందని అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ విస్తృత పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రష్యా వ్యాక్సిన్‌పై పోస్ట్ రిజిస్ట్రేషన్ క్లినికల్ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే, టీకాను ఆమోదించి, విడుదల చేయడంపై నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం? అనే చర్చ జరుగుతోంది.
ఈ సందేహాలకు చెక్ పెడుతూ.. లాన్సెట్ జర్నల్ రష్యా వ్యాక్సిన్‌పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 76 మందిపై వ్యాక్సిన్ ప్రయోగం చేయగా.. వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కన్పించలేదని, 42 రోజుల పాటు క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపింది. 21 రోజుల్లోనే వాలంటీర్లలో యాంటీబాడీస్ తయారైనట్టు లాన్సెట్ జర్నల్ తెలిపింది.