సోదరుడికి కరోనా.. హోమ్ క్వారంటైన్‌లోకి సౌరవ్ గంగూలీ...!

గురువారం, 16 జులై 2020 (10:46 IST)
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ సోదరుడు, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ స్నేహశీష్‌ గంగూలీ కరోనా వైరస్ బారిన పడటంతో బెంగాల్ దాదా హోమ్ క్వారెంటైన్‌లోకి వెళ్లాడు. బుధవారం సాయంత్రం అతడి సోదరుడు, స్నేహశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గంగూలీ క్వారంటైన్‌లోకి వెళ్లడం తప్పలేదు. 
 
స్నేహశీష్‌కు వైరస్‌ సోకిందని తెలియగానే బెల్లీ వ్యూ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా స్నేహశీష్‌ జ్వరంతో బాధపడుతున్నాడని, ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు బెంగాల్‌ క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గంగూలీ సైతం కొద్ది రోజులు గృహ నిర్బంధంలో ఉంటాడని అతడి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
 
కొద్ది రోజుల క్రితం స్నేహశీష్‌ భార్య, ఆమె తల్లి దండ్రులు కరోనా బారిన పడడంతో ఆయన బెహాలాలోని స్వగృహానికి వచ్చారు. కాగా, దాదా కుటుంబం మొత్తం అక్కడే నివసిస్తున్న విషయం తెలిసిందే.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు