ఇందుకోసం బ్యాంకులు పిఎం కిసాన్ సమ్మన్ నిధి డేటాను కూడా ఉపయోగించవచ్చు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా కెసిసి జారీ చేయాలని ఆదేశించింది. కేసీసీపై రూ .3 లక్షల వరకు తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు 9 శాతం వుంటుంది. అయితే సర్కారు అందులో రెండు శాతం సబ్సిడీ ఇస్తుంది. ఈ విధంగా తీసుకునే క్రెడిట్‌కు వడ్డీ రేటు ఏడు శాతానికి పడిపోతుంది.
అలాగే తీసుకున్న రుణాన్ని సమయానికి చెల్లిస్తే.. మూడు శాతం ఎక్కువ తగ్గింపు లభిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈవిధంగా, ఇది రైతులకు 4 శాతంగా ఉంది. కేసీసీ తీసుకున్న రుణం చెల్లించే తేదీని ప్రభుత్వం మే 31కు పొడిగించింది. ఇంతకుముందు, కిసాన్ క్రెడిట్ కార్డ్ జారీ చేసిన రైతులకు ప్రాసెసింగ్ ఫీజు, తనిఖీ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించేది. కానీ ఇప్పుడు అది రద్దు చేశారు.
కేసీసీని ఎలా పొందవచ్చంటే..?
వ్యవసాయం చేసే రైతులు దీన్ని పొందవచ్చు. పొలాన్ని సొంత భూమిలో పండించినా లేదా వేరొకరి భూమిలో పండించినా, రైతు క్రెడిట్ కార్డు పొందవచ్చు. కెసిసికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు, అలాగే రుణ వ్యవధి ముగిసే వరకు గరిష్టంగా 75 సంవత్సరాలు ఉండాలి. 60 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు, సహ దరఖాస్తుదారుడు ఉండాలి. అది దరఖాస్తుదారుడి దగ్గరి బంధువు కావచ్చు. సహ దరఖాస్తుదారుడి వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తుకు ప్రాథమిక పత్రాలు దరఖాస్తుదారుడి వద్ద ఉండాలి. వారి వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఓటరు ఐడి కార్డ్, ఐడి ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఇది కాకుండా, దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా దరఖాస్తు కోసం అవసరం. చాలా బ్యాంకులు కేసీసీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తును అందిస్తున్నాయి. ఇందుకోసం వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు ఫారం పొందవచ్చు.