తెలుగు రాష్ట్రాల్లో కరోనా.. తెలంగాణలో కొత్తగా 2,278 కేసులు.. ఏపీలో 9999 కేసులు

శనివారం, 12 సెప్టెంబరు 2020 (09:50 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 331, రంగారెడ్డిలో 187, మేడ్చల్‌లో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్రంలో 9999 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,47,686కి పెరిగింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4779కి చేరింది.
 
గడిచిన 24 గంటల్లో ఏపీలోని కడప జిల్లాలో 9, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 8, గుంటూరు 7, కృష్ణా 7, అనంతపురం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 3, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు