వూహాన్‌లో మాస్కులు లేకుండా జనం.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే? (Video)

బుధవారం, 19 ఆగస్టు 2020 (14:17 IST)
Wuhan
కరోనా వైరస్... వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. కోటి మందికిపైగా జనాభా ఉన్న వుహాన్‌లో వైరస్ కారణంగా భారీ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించింది. కానీ చైనా మాత్రం కరోనా కేసులు, మరణాల విషయంలో గోప్యత పాటించింది. మృతుల సంఖ్యను బయటికి చెప్పకుండా సవరించింది. తానీ వాటిపై అనుమానాలున్నాయి. ఇప్పటికే కరోనా విషయంలో చైనా అప్రమత్తంగా లేదని.. అందుకే ప్రపంచ దేశాలకు ఈ వ్యాధి సోకిందని.. అమెరికా లాంటి అగ్రరాజ్యాలతో పాటు ఇతర దేశాలు కూడా గుర్రుగా వున్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల్లో వుహాన్‌లో జనజీవనం మెల్లగా పట్టాలెక్కింది. కరోనా కారణంగా వుహాన్‌లో 76 రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. దీంతో జనజీవనం మెల్లగా పట్టాలెక్కింది. జూన్‌లో ఈ వాటర్ పార్క్‌ను తెరవగా.. ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వీరిలో కొందరు లైఫ్ జాకెట్లు ధరించారు కానీ.. ఏ ఒక్కరూ మాస్కు ధరించకపోవడం గమనార్హం. 
 
కరోనాను చైనానే ప్రపంచానికి అంటించిందని బలంగా నమ్ముతున్న చాలామంది.. వుహాన్ వాసులు ఇలా మాస్కులు లేకుండా ఎంజాయ్ చేస్తుండటం చూసి మరోసారి తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. చైనా సర్కారు మాత్రం తెలివిగా... పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం హుబేయ్ ప్రావిన్స్‌లోని 400 టూరిస్ట్ స్పాట్‌లలోకి ఉచితంగా పర్యాటకులను అనుమతిస్తున్నామని చెప్తోంది. 

This is Wuhan, China last Saturday.

Yeah...things aren’t adding up. We’re being lied to my friends. pic.twitter.com/gPp585fxov

— samanthamarika (@samanthamarika1) August 18, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు