దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 25,072 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదేవిధంగా గతేడాది మార్చి తర్వాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయని తెలపింది. ఈ కొత్త కేసులతో కలుపుకుని నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది.
అలాగే 24 గంటల్లో కరోనా నుంచి 44,157 మంది కోలుకున్నారు. నిన్న 389 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,34,756కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,16,80,626 మంది కోలుకున్నారు.
3,33,924 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 7,95,543 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్పటివరకు మొత్తం 58,25,49,595 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్రకటించారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 7,95,543 మందికి టీకా ఇచ్చామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం 58,25,49,595 డోసులను పంపిణీ చేశామని తెలిపింది.