కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్.. యూపీ వార్డ్ బాయ్ మృతి

సోమవారం, 18 జనవరి 2021 (10:40 IST)
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా జర్మనీ, నార్వే, బ్రెజిల్‌లో పదుల సంఖ్యలో మరణాలు నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వికటించడంతో మరణించే వారి సంఖ్య భారత్‌లోనూ ప్రారంభమైంది. తాజాగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ తొలిరోజు టీకా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి వార్డు బాయ్ ఆ మరుసటి రోజు మృతి చెందాడు. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఛాతీనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.
 
దీనిపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇస్తూ, మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడని, ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌తో అతను మరణించినట్టు తాను అనుకోవడం లేదని చెప్పారు. మృతికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
 
కాగా, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న 22 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తడంతో ఐసీయూలో చేర్చారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఎలర్జీ రియాక్షన్ తలెత్తిందని, తలపోటు, ర్యాష్, రెస్పిరేటరీ డిస్ట్రస్‌తో బాధపడడ్డాడని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
 
మహీపాల్ కుమారుడు విశాల్ మాట్లాడుతూ, "టీకా తర్వాత నాన్న అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనం నడపలేకపోయాడు. ఆటోలో వెళ్ళి నాన్నకు ఆస్పత్రిలో చేర్చానని తెలిపాడు. నేను మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడకు చేరుకున్నాను. అప్పటికే అతని పరిస్థితి మరింత దిగజారింది. అతను మామూలుగానే ప్రవర్తించలేదు. 
 
శ్వాస ప్రక్రియ సరిగ్గాలేదు. కొన్ని రోజుల క్రితం, పక్షం రోజులు కావచ్చు, అతనికి తేలికపాటి జ్వరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంటికి తీసుకొచ్చి.. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ ఆదివారం సాయంత్రానికి తండ్రి పరిస్థితి క్షీణించింది. ఆస్పత్రిలో అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. నా తండ్రి మృతి కరోనా టీకా దుష్ప్రభావమేనని భావిస్తున్నట్లు చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు