కొరియా, వియత్నాం యుద్ధాలతో పోటీగా అమెరికా కోవిడ్ మృతులు

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:35 IST)
అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం యుద్ధాల్లో మొత్తం ఎంత మంది మరణించారో.. కోవిడ్‌ కారణంగా ఒక్క ఏడాదిలో అంతమంది మరణించినట్లు ఈ మేరకు జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు చెప్తున్నాయి. 
 
మహమ్మారికి బలైన అమెరికన్లకు సంతాపంగా శ్వేత సౌధంలో అధ్యక్షుడు బైడెన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. రాబోయే ఐదు రోజుల పాటు ఫెడరల్‌ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆయన ఆదేశించారు. 
 
కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 2.5మిలియన్ల మంది మరణించారు. అందులో 20శాతం మరణాలు అమెరికావే కావడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిన నేపథ్యంలో అందరూ మాస్కు, సామాజిక దూరం పాటించడం కొనసాగించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
యూఎస్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో 4.05లక్షల మంది మరణించారు. ఆ తర్వాత వియత్నాం యుద్ధంలో 58వేల మంది, కొరియన్‌ వార్‌లో 36వేల మంది మరణించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు