28 రోజుల క్రితం టీకా మొదటి మోతాదు తీసుకునే ముందు గానీ, మంగళవారం మధ్యాహ్నం కోవిషీల్డ్ యొక్క బూస్టర్ రెండో మోతాదు తీసుకునే ముందుగానీ ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. మంగళవారం సాయంత్రం, ఆమెకు అసౌకర్యం కలగడం ప్రారంభమైంది. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారని బార్వానీ జిల్లా సిఎంహెచ్‌ఓ డాక్టర్ అనితా సింగారే తెలిపారు.
ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు చికిత్స చేస్తున్న సమయంలో మరణించిందని డాక్టర్ సింగారే తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టరేట్‌కి సమాచారం ఇవ్వబడిందన్నారు. శవపరీక్ష నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. మంగళవారం-బుధవారం రాత్రి ఆసుపత్రిలో ఆమె చికిత్సకు సంబంధించిన రికార్డులతో సహా అన్ని సంబంధిత పత్రాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ 19 టీకాలు వేసిన తరువాత మరణించిన మొదటి ఆరోగ్య కార్యకర్త మరణం ఇది. రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, మొత్తం 32,529 మంది ఆరోగ్య కార్యకర్తలకు మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ మోతాదు వేశారు.