కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు ఏకంగా లక్షన్నర మంది మృత్యువాతపడ్డారు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 22 లక్షలకు చేరుకోగా, మరో దాదాపు ఆరు లక్షల మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.
తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి 1,54,25 మంది చనిపోయారు. వరల్డ్ వైడ్‌గా 22,50,683 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే, 5,72,076 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.
ఇకపోతే, అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా అగ్రరాజ్యం అమెరికా ఉంది. ఇక్కడ ఇప్పటికే ఏకంగా 32,230 మంది చనిపోయారు. అలాగే, స్పెయిన్‌లో 20,002 మంది, ఇటలీలో 22,745 మంది, ఫ్రాన్స్‌లో 18,681, జర్మనీలో 4,352, బ్రిటన్‌లో 14,576, చైనాలో 4,632, ఇరాన్‌లో 4,958, టర్కీలో 1,769, బెల్జియంలో 5,163, బ్రెజిల్‌లో 2,171, కెనడాలో 1301, కెనడాలో 3,459, స్విట్జర్లాండ్‌లో 1,327 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇకపోతే, భారత్‌లో మాత్రం ఈ మరణాలు కేవలం 480గా ఉన్నాయి. అలాగే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 14378గా నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 50 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1360 కేసులు ఉన్నాయి.