శ్రీలంక క్రికెటర్ల డుమ్మా... పాకిస్థాన్ టూర్‌ వద్దనే వద్దట

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (11:04 IST)
పాకిస్థాన్ దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో క్రికెట్ పర్యటనకు వెళ్లకూడదని శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన పది మంది క్రికెటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తప్పుబడుతోంది. 
 
నిజానికి ఈ నెల 27వ తేదీ నుంచి శ్రీలంక జట్టు పాకిస్థాన్ గడ్డపై 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సివుంది. కానీ, శ్రీలంక టి20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ సహా 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్ వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్టు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ వెళ్లాలా? వద్దా? అనేది తాము ఆటగాళ్లకే వదిలేశామని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఏంజెలో మాథ్యూస్, తిసర పెరెరా, నిరోషన్ డిక్వెలా, కుశాల్ పెరెరా, ధనంజయ డిసిల్లా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చాందిమల్, దిముత్ కరుణరత్నే కూడా ఈ టూర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
 
2009లో లాహోర్‌లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో శ్రీలంక ఆటగాళ్లలో పలువురు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగా, మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన అనంతరం విదేశీ జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాలంటే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు