పాకిస్థాన్‌కు నో: హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలనుకుంటున్న టీమిండియా

సెల్వి

గురువారం, 11 జులై 2024 (12:02 IST)
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశం లేదు. వచ్చే ఏడాది టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ద్వైపాక్షిక కారణాల చేత పాకిస్థాన్‌తో భారత్ దూరంగా వుంది. 
 
అలాగే పాకిస్థాన్‌కు ఇండియా పంపేందుకు బీసీసీఐ సుముఖతగా లేనట్లు తెలుస్తోంది. 2023 ఆసియా కప్‌ కోసం భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. బదులుగా శ్రీలంకలో వారి మ్యాచ్‌లు ఆడారు. అయితే, పాకిస్థాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించారు. అయితే లీగ్ దశలోనే డకౌట్ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాతో మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ని అభ్యర్థిస్తుంది.
 
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే బీసీసీఐ ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని కోరుతోంది. గత సంవత్సరం భారతదేశం జరిగిన ఆసియా కప్ తరహాలో.. శ్రీలంకలో అన్ని ఆటలను ఆడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు