ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. టాప్-4 బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (4), ఇషాన్ కిషన్ (27), శ్రేయాస్ అయ్యర్ (4), రిషబ్ పంత్ (17) పరుగులు మాత్రమే చేశారు.
ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కేలా చేశారు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ 9 ఫోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా మహారాజ్, ప్రెటోరియస్, మార్కో జాన్సెన్, నోర్ట్జే తలో వికెట్ తీశారు.
టీమిండియా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. డస్సెన్ చేసిన 20 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చాహల్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.