Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

చిత్రాసేన్

సోమవారం, 6 అక్టోబరు 2025 (18:30 IST)
Bad Boy Karthik, Naga Shaurya
హీరో నాగ శౌర్య రెండు సినిమాలు మినహా పెద్దగా ఆడిందిలేదు. కొన్ని మాస్ ఇమేజ్ తో సినిమాలు చేసినా బెడిసికొట్టింది. అయినా మరోసారి అటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే వినోదం కూడా మేళవించి నటుడిగా నిలబడాలని కంకణం కట్టుకున్నారు. పెండ్లి చేసుకున్న తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం బ్యాడ్ బాయ్ కార్తీక్. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మేకర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. 
 
టీజర్ నాగ శౌర్యను రగ్గడ్ , ఇంటెన్స్ స్టైలిష్ న్యూ అవతార్‌లో ప్రజెంట్ చేస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, హై-ఆక్టేన్ మూమెంట్స్ తో మాస్ పాత్రలో పరిచయం చేస్తోంది. ఈ టీజర్‌లో శౌర్యతో పాటు విధి, సముద్రఖని, నరేష్ వికె, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంలో ఇంటెన్స్ డ్రామా, హ్యూమరస్ కామెడీ కలగలిసి ఉన్నాయి.
 
నాగ శౌర్య స్క్రీన్ ప్రెజెన్స్, షార్ఫ్ డైలాగ్ డెలివరీ, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మంచి హ్యుమర్ ని ప్రామిస్ చేస్తోంది. దర్శకుడు రామ్ దేసినా అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించారు. రసూల్ ఎల్లోర్ డైనమిక్ సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. హారిస్ జయరాజ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది. 
 
శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. బ్యాడ్ బాయ్ కార్తీక్ త్వరలో బిగ్ స్క్రీన్స్ లోకి రానుంది. 
 
నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, నరేష్ వీకే, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు