తిరుమల శ్రీవారి ఆలయం ముందు యువతి రీల్స్ (video)

ఐవీఆర్

సోమవారం, 6 అక్టోబరు 2025 (18:50 IST)
తిరుమల ఆలయం ముందు ఓ యువతి సంప్రదాయ దుస్తుల్లో రీల్స్ చేస్తూ కనిపించింది. ఆమె ఆలయానికి వెలుపల వున్న ప్రదేశంలో రకరకాలుగా వీడియోలు తీసుకుంటూ కనిపించింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఇలాంటి వీడియోలు గతంలోనూ కొందరు చేసిన ఘటనలు వున్నాయి. ఐతే రీల్స్ చేసిన సదరు యువతి వాటిని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో వ్యవహారం బైటకు వచ్చింది. దీనిపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గుడి ముందు ఇంత జరుగుతున్నా తితిదే మొద్దు నిద్ర పోతుందా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
 
ఐతే గతంలోనూ కొందరు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఏకంగా గుడి గోపురం ఎదురుగానే విమర్శలు చేస్తూ హంగామా చేసేవారు. ఇలాంటివి ఎవరికివారు స్వీయ నియంత్రణ చేసుకోవాలే తప్పించి ప్రతి వ్యక్తి ఏమి చేస్తున్నాడో గమనించడం తితిదే చేయగలదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
 

బాబూ @svbcttd ... సాంస్కృతిక వైభవం కోటాలో ఇది కూడా కలిపెయ్యి !!

చూడటానికి మేము ఉన్నాం కదా ?? pic.twitter.com/mQPxoE8JBx

— AI పోత రాజు !! (@datapelter) October 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు