మహారాష్ట్రలోని నేషనల్ హైవే 4పై కుటుంబంతో కలిసి మధుకర్ బాబూరావు రహానే తన హుండై ఐ20లో కారులో ప్రయాణిస్తుండగా, కంగల్ ప్రాంతంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి 67 ఏళ్ల ఆశాతాయ్ కాంబ్లి అనే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
దీంతో కోల్హాపూర్ పోలీసులు రహానే తండ్రిపై ఐపీసీ సెక్షన్లు 304ఏ, 289, 337,338 కింద కేసు నమోదు చేశారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో కోల్హాపూర్ పోలీసులకు రహానే తండ్రిని అదుపులోని తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం రహానే మూడు వన్డే కోసం విశాఖపట్నంలో ఉన్నాడు.