విరాట్ కోహ్లీ, అనుష్కల హనీమూన్ ఫోటో.. 1,710,358 లైక్స్
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్కశర్మల వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబై నగరాల్లో వీరి పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త జంట దక్షిణాఫ్రికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు.. అనుష్క షేర్ చేసిన ఫోటోను బట్టి తెలుస్తోంది. తాజాగా అనుష్క శర్మ తన హనీమూన్ ట్రిప్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పటికే ప్రపంచ హాటెస్ట్ స్పోర్ట్స్ పవర్ కపుల్ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఈ జంట హనీమూన్ ఫోటోలో చూడముచ్చటగా వుందని శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోను 1,710,358 మంది లైక్ చేశారు.