టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు వివాహ జీవితంలోకి అడుగెట్టిన సంగతి తెలిసిందే. వీరికి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్ కోహ్లీకి శుభాకాంక్షలతో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. తన అధికారిక యాప్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.