నిజానికి గతంలో 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ట్వీట్ చేసిన క్రికెటరే ఈ వ్యాట్ కావడం గమనార్హం. అలా బహిరంగంగా తనను పెళ్లి చేసుకోమని కోరిన డేనియల్.. 19 యేళ్ల అర్జున్ టెండూల్కర్‌తో లంచ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ముంబై ఆఫ్ సీజన్ క్యాంప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో అర్జున్ టెండూల్కర్ పేరు లేకపోవడం గమనార్హం.